కాకినాడ ఆస్పత్రిలో బాంబు కలకలం
కాకినాడ : కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో స్కూటర్‌కు అమర్చిన బాంబు కలకలం సృష్టించింది. ఆదివారం ఉదయం ఆసుపత్రిలోని ప్రసూతి వార్డు సమీపంలో భవన నిర్మాణ కాంట్రాక్టరు తన స్కూటర్‌ను ఉంచి బయటకు వెళ్లాడు. కాసేపటికి అతనికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ వచ్చింది. స్కూటర్‌కు బాంబు పెట్టామనీ, 15 నిమిషాల్లో పేలుతుందని ఆ వ్యక్తి హెచ్చరించడంతో కాంట్రాక్టరు పోలీసులకు సమాచారం అందించారు. ప్రసూతి వార్డు నిర్మాణం పనులు చేస్తున్నారు. పోలీసులు, బాంబు స్క్వాడ్ సకాలంలో వచ్చి బాంబును నిర్వీర్యం చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తామని పోలీసులు చెప్పారు. బాంబు ఎవరు పెట్టారనే విషయాన్ని కనుక్కుంటామని వారు చెప్పారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications
