ఇప్పుడే పుట్టిన పార్టీ పీఆర్పీ: డిఎస్

D Srinivas
హైదరాబాద్: చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఇప్పుడే పుట్టిన పార్టీ అని, ఆ పార్టీ నాయకులు తమను కాకుండా ఎవరిని అంటారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. కాంగ్రెస్ లో సామాజిక న్యాయం లేదనే ప్రజారాజ్యం పార్టీ నేతల వ్యాఖ్యలపై ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆ విధంగా అన్నారు. తాము పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ సామాజిక న్యాయం పాటిస్తున్నామని, ఈ విషయం ప్రజలకు బాగా తెలుసునని ఆయన అన్నారు. ప్రభుత్వం బలహీనవర్గాల కోసం లెక్కలేనన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని, వాటి గురించి చెప్పాలంటే సమయం సరిపోదని ఆయన అన్నారు.

పిసిసి కార్యవర్గంపై తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు వి. హనుమంతరావు విమర్శలు చేసినట్లు తన దృష్టికి రాలేదని ఆయన అన్నారు. ఈ విషయంలో ఎవరికైనా అభ్యంతరాలుంటే తన వద్దకు వచ్చి వ్యక్తిగతంగా మాట్లాడితే వివరణ ఇస్తానని ఆయన చెప్పారు. ఎమ్మెల్సీలను కార్యవర్గంలో వేసుకుంటే ఎన్నికల సమయంలో తనకు గాంధీభవన్ లో అందుబాటులో ఉంటారని ఆయన చెప్పారు. అలా కాకుండా వేరే వారిని వేసుకుంటే టికెట్లు వస్తే తనకు అందుబాటులో ఉండరని, టికెట్లు రానివారు అసంతృప్తికి గురై దూరంగా ఉంటారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సమయంలో తనకు అందుబాటులో ఉండేవారిని కార్యవర్గంలో వేసుకున్నామని ఆయన వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+