రాజస్థాన్ లో పేలుడు: 18 మంది మృతి
భరత్ పూర్: రాజస్థాన్ లో దీపావళి క్రాకర్స్ మందుగుండ్లు పేలి ఐదారు ఇళ్లు కూలిపోవడంతో 18 మంది మరణించారు. మరో 18 మంది గాయపడ్డారు. భరత్ పూర్ కు 30 కిలోమీటర్ల దూరంలో గల దీఘ్ లో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘోరం సంభవించింది.
నివాస ప్రాంతాల్లో అక్రమంగా క్రాకర్స్ తయారు చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు. పేలుడులో 18 మంది మృతి చెందినట్లు భరత్ పూర్ పోలీసు సూపరింటిండెంట్ రోహిత్ మహాజన్ ధృవీకరించారు. క్షతగాత్రులను దీఘ్ లోని ఆస్పత్రికి చికిత్స నిమిత్తం పంపించినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications
