ఒకే రోజు తిరుపతిలో నలుగురి హత్య
తిరుపతి: ఒకే రోజు తిరుపతిలో నలుగురు హత్యకు గురి కావడం సంచలనం సృష్టిస్తోంది. ఒక ముగ్గురు హత్యకు గురికాగా, మరో ఘటనలో ఒక యువతి హత్యకు గురైంది. తిరుపతిలోని భవానీ నగర్ లో తల్లీ, ఇద్దరు పిల్లలు దారుణ హత్యకు గురయ్యారు. వనజాక్షి అనే మహిళతో పాటు ఆమె ఇద్దరు పిల్లలు మౌని, వనజాక్షి హత్యకు గురయ్యారు. అనుమానంతో వనజాక్షి భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
భవానీనగర్ లోని ఇంట్లో వనజాక్షి, ఇద్దరు పిల్లలు పడుకున్నారు. మరో గదిలో భర్త పడుకున్నాడు. ముందు గదిలో వారికి బంధువైన మరో వ్యక్తి పడుకుని ఉన్నాడు. తెల్లారి లేచే సరికి వనజాక్షి ఇద్దరు పిల్లలు హత్యకు గరై కనిపించారు. తాను బయటకు వచ్చి చూసే సరికి తమ బంధువు లేడని వనజాక్షి భర్త విజయ్ కుమార్ చెబుతున్నాడు.
కాగా, తిరుమల శ్రీవారి సన్నిధిలోనే ఒక యువతిపై దుండుగులు అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. ఆమె శవం పొదల్లో పడి ఉండడాన్ని పోలీసులు కనుక్కున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications
