వారంలో ఇంధన ధరల తగ్గింపు: దేవరా
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గిన నేపథ్యంలో ఇంధన ధరల తగ్గింపుపై వారంలో ఒక ప్రకటన చేస్తామని పెట్రోలియం శాఖ మంత్రి మురళీ దేవరా చెప్పారు. లోకసభలో ఆయన గురువారం ఈ విషయం చెప్పారు. ఈ విషయాన్ని పరిశీలించి వారంలోగా ఒక ప్రకటన చేస్తామని ఆయన చెప్పారు. బిజెడి సభ్యుడు బ్రజ్ కిశోర్ త్రిపాఠీ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు మరింత తగ్గే విషయమై నిరీక్షిస్తున్నామని, ఈ తర్వాత ఇంధన ధరలను తగ్గించే విషయమై పరిశీలిస్తామని మంత్రి చెప్పారు. అయితే ఈ విషయమై వెంటనే సమాధానం కావాలని సభ్యులు పట్టుబట్టారు. దీంతో వారంలోగా ఈ విషయమై ప్రకటన చేస్తామని ఆయన చెప్పారు. ఎయిర్ లైన్స్ కు బెయిల్ అవుట్ ప్యాకేజీ ఇచ్చిన విషయం నిజం కాదని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications
