సీమ సిఎంలు ఉన్నందున్నే..: జెసి
న్యూఢిల్లీ: తమ ప్రాంతం వాళ్లు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రత్యేక తెలంగాణ వాదాన్ని ముందుకు తెస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జెసి దివాకర్ రెడ్డి విమర్సించారు. ప్రస్తుతం వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం వల్లనే రాష్ట్ర విభజన అంశాన్ని ముందుకు తెస్తున్నారని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. గతంలో నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నందు వల్లనే రాష్ట్ర విభజన అంశాన్ని ముందుకు తెచ్చినట్లు ఆయన అభిప్రాయపడ్డారు.
అధికారం కోసమే రాష్ట్ర విభజన కోసం డిమాండ్ చేస్తున్నారని ఆయన విమర్శించారు. పరిపాలనా సౌలభ్యం కోసం ఆ వాదాన్ని ముందుకు తెస్తే ఫరవాలేదని, అధికారం కోసం ముందుకు తేవడం వల్లనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని ఆయన అన్నారు. హైదరాబాదుపై అభిప్రాయసేకరణ జరిపించాల్సిందేనని ఆయన అన్నారు. తమ రాయలసీమ ప్రాంతాన్ని చిన్న రాష్ట్రంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ కూడా ఉందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
