తుది దశలో తెలంగాణ అంశం: కెసిఆర్

తెలంగాణపై ప్రణబ్ ముఖర్జీ కమిటీ వెంటనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెసుకు ఇంకా సమయం ఉందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆయన అన్నారు. తాము నవ తెలంగాణ పార్టీ (ఎన్టీపి) నేత టి. దేవేందర్ గౌడ్ తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా కలిసి పని చేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ కోసమే పనిచేస్తున్నందున దేవేందర్ గౌడ్ తో కలిసి పనిచేయడానికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
