విద్యార్థులతో ఆడుకోవద్దు: రాజనర్సింహ
హైదరాబాద్: ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయని, ప్రభుత్వాన్ని ఉపాధ్యాయులు నమ్మాలని పాఠశాల విద్యా మంత్రి అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని ఆయన గురువారంనాడు సమ్మె చేస్తున్న ఉపాధ్యాయులను ఉద్దేశించి అన్నారు. 15 రోజుల్లో డిఎస్సీ 2008 నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆయన చెప్పారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు బుధవారం సమ్మె ప్రారంభించారు.
ఐక్య ఉపాధ్యాయ కార్యాచరణ సమితి (జాక్టో) ఆధ్వర్యంలో గురువారంనాడు కూడా సమ్మె కొనసాగింది. దీంతో పాఠశాలలు మూతపడ్డాయి. ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు ఇళ్లకు దారి పట్టారు. ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేశారు. ఉపాధ్యాయుల సమ్మెకు తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతు ప్రకటించాయి. జాక్టో నేతలు గురువారం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణను కలిసి మద్దతు కోరారు.












Click it and Unblock the Notifications
