తెలంగాణపై మాట ఇచ్చిన సోనియా

తెలంగాణపై కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని తాము సోనియాను కోరినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఈ పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు ప్రతిపాదించాలని తాము అడిగామని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తామని హామీ ఇచ్చినందున ఆ హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కాంగ్రెసుపై ఉందని చెప్పామని ఆయన అన్నారు. తెలంగాణపై వాతావరణం సానుకూలంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
వ్యక్తులు కావాలా, ప్రజలు కావాలా అనే విషయాన్ని తేల్చుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీయేనని, ప్రజలకు న్యాయం చేయకపోతే నష్టపోతారని ఆయన అన్నారు. తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెసు నష్టపోతుందని తాను సోనియాతో చెప్పలేదని, ఇది వారి వ్యక్తిగత విషయమని ఆయన అన్నారు. నవంబర్ 1వ తేదీ వరకు వేచి చూసి తాము తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించుకుంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
