ఫ్లై వోవర్ పై వ్యాన్ ప్రమాదం
హైదరాబాద్: ఫ్లైఓవర్‌పైనుంచి వ్యాన్ పడి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన రామకృష్ణాపురంలో జరిగింది. ఈ సంఘటనలో మరో 4గురికి గాయాలయ్యాయి. బుధవారం రాత్రి ఫ్త్లెఓవర్‌పైనుంచి గ్యాస్ సిలిండర్లతో వెళుతున్న ఓ డీసీఎం వ్యాన్ వేగంగా వస్తూ ఎదురుగా వస్తున్న మరో వ్యాన్‌ను అనంతరం ఓ కారును ఢీకొంది.
వేగంగా ఢీకొనటంతో ఫ్త్లెఓవర్‌పైనుంచి కిందకు పడిపోయింది. అందులోని యువకుడి వ్యానుకింద పడి మృతి చెందాడు. ఈలోగా గ్యాస్ లీక్ అవటంతో స్థానికులు సిలిండర్లను సమీపంలో ఉన్న చెరువులో వేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. మరో 4గురు గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications
