నేను కోలుకుంటున్నాను: దాసరి

సినీ ప్రముఖుడు దాసరి నారాయణ రావును ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు మెగాస్టార్ చిరంజీవి గురువారం సాయంత్రం పరామర్శించారు. దాసరి త్వరలో కోలుకోవాలని ఆ దైవాన్ని ప్రార్ధిస్తున్నానని చిరు తెలిపారు. చిరంజీవి భార్య సురేఖ, బావమరిది అల్లు అరవింద్‌లు కూడా దాసరిని పరామర్శించారు. భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దాసరిని కలుసుకున్నారు. ఆయన ఆరోగ్య విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం దర్శకుడు కోడి రామకృష్ణ, రేలంగి నరసింహరావు తదితరులు దాసరిని పరామర్శించి బాగోగులు అడిగి తెలుసుకున్నారు.












Click it and Unblock the Notifications