యువగర్జనకు బాలయ్య ఒక్కడే?

Balakrishna
హైదరాబాద్: గుంటూరులో వచ్చే నెల 5వ తేదీన జరిగే యువగర్జన సదస్సుకు ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ ఒక్కరే హాజరయ్యే అవకాశం ఉంది. మిగతా నందమూరి హీరోలను దీనికి దూరంగా ఉంచే అవకాశం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తి ప్రదర్శించకపోవడంతో మిగతా నందమూరి హీరోలు కళ్యాణ్ రామ్, తారకరత్నలను కూడా యువగర్జన సదస్సుకు దూరంగా ఉంచాలని తెలుగుదేశం అధినాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. వారిద్దరు కూడా వచ్చి జూనియర్ ఎన్టీఆర్ రాకపోవడం వల్ల ప్రజల్లోకి వ్యతిరేక సంకేతాలు వెళ్తాయని, దాన్ని నివారించడానికి మిగతా ఇద్దరిని కూడా దూరంగా ఉంచడం మంచిదని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

గన్నవరం సీటు విషయంలో కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లకు మధ్య తలెత్తిన వివాదం ఇప్పుడు గుదిబండగా మారింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆహ్వానించి చెప్పినా జూనియర్ ఎన్టీఆర్ యువగర్జన సదస్సుకు రావడానికి అంగీకరించలేదు. రాజకీయాల కోసం కెరీరును ఫణంగా పెట్టలేనని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. దీంతో మిగతా ఇద్దరు కూడా కెరీర్ పై దృష్టి పెడతారనే సాకు చూపి వారిని కూడా యువగర్జన సదస్సుకు దూరంగా ఉంచాలనే వ్యూహం తయారవుతున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+