జెసిపై విచారణ జరిపించాలి: విద్యాసాగర్
హైదరాబాద్ : మంత్రి జేసీ దివాకర్‌రెడ్డిపై మరో మంత్రి గొల్లపల్లి సూర్యారావు చేసిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని భాజపా సీనియర్ నేత విద్యాసాగర్‌రావు డిమాండ్ చేశారు. ఇద్దరు మంత్రులు పదవిలో కొనసాగేందుకు అనర్హులని ఆయన అన్నారు. ప్రభుత్వం జరుగుతున్న అవినీతి, అక్రమాలకు గొల్లపల్లి ఆరోపణలే నిదర్శనమని రావు అన్నారు.
గొల్లపల్లి సూర్యారావు చేసిన విమర్శలు కేవలం ఇద్దరు నాయకులకు, కాంగ్రెసు పార్టీకి సంబంధించిన వ్యవహారం కాదని, ప్రజలకు సంబంధించిన వ్యవహారమని, అందువల్ల దానిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన అన్నారు. దివాకర్ రెడ్డిపై గొల్లిపల్లి సూర్యారావు చేసిన ఆరోపణలపై ముఖ్యమంత్రి వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications
