పొత్తులపై నిర్ణయించలేదు: జయశంకర్
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో పొత్తులపై ఇప్పటి వరకు ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సిద్ధాంతకర్త జయశంకర్ స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో పొత్తులపై ఆలోచిస్తామని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. సమీకరణాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అయితే ఇప్పటి వరకు నిర్ణయం మాత్రం తీసుకోలేదని ఆయన అన్నారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే కాంగ్రెసును ఓడించే లక్ష్యంతో పని చేస్తామని ఆయన చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు గెలిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడబోదని, కేంద్రంలో కాంగ్రెసు తప్ప ఏ కూటమి అధికారంలోకి వచ్చినా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని, అందువల్ల కాంగ్రెసును ఓడించే లక్ష్యంతో పని చేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తుందనే ఉద్దేశంతోనే గత ఎన్నికల్లో కాంగ్రెసుతో కలిసి పని చేశామని, కానీ కాంగ్రెస్ అందుకు సిద్ధంగా లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
