మంత్రులు జెసి, గొల్లపల్లిల సవాళ్లు

హైదరాబాద్‌ : సహచరమంత్రి గొల్లపల్లి సూర్యారావు తనపై చేసిన ఆరోపణలపై ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్టు రాష్ట్ర పంచాయతీరాజ్‌ మంత్రి జేసీ దివాకరరెడ్డి తెలిపారు. తనపై చేసిన ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు ఆయన అన్నారు. తనపై గొల్లపల్లి సూర్యారావు చేసిన ఆరోపణల మీద విచారణ జరిపించాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. ఇసుక ర్యాంపుల విషయంలో జెసి దివాకర్ రెడ్డి 7 కోట్ల రూపాయలు స్వాహా చేశారని లఘు పరిశ్రమల మంత్రి గొల్లపల్లి సూర్యారావు శనివారం తూర్పు గోదావరి జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆరోపించారు. వ్యక్తిగత విభేదాల వల్లనే గొల్లపల్లి సూర్యారావు తనపై ఆరోపణలు చేస్తున్నారని జెసి దివాకర్ రెడ్డి అన్నారు.

మంత్రి జేసీ దివాకరరెడ్డి వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్‌ పతనావస్థకు చేరుకుందని రాష్ట్ర చిన్నతరహా పరిశ్రమల శాఖ గొల్లపల్లి సూర్యారావు అమలాపురంలో ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లాకు ఇన్‌ఛార్జి మంత్రిగా వచ్చిన అనంతరం వచ్చిన అవినీతి సొమ్ముతో జేసీ రూ.12 లక్షలతో కారు కొన్నారని ఆయన ఆరోపించారు. జెసి దివాకర్ రెడ్డిపై వచ్చిన ఆరోపణలను రుజువు చేయలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+