కాంగ్రెసును ఓడిస్తాం : మందకృష్ణ
నిజామాబాద్ : వచ్చే ఎన్నికల్లో ఎస్సీలు నిర్ణయాత్మక శక్తిగా మారనున్నారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ అన్నారు. డిసెంబర్లో జరిగే పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించకపోతే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించేందుకు ఎమ్మార్పీస్ కృషి చేస్తుందని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తన యాత్రలో భాగంగా ఆయన నిజామాబాద్ చేరుకున్నారు.
ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేతుల్లో పెట్టారని, అందువల్ల కాంగ్రెస్ తలుచుకుంటే వర్గీకరణ బిల్లు పార్లమెంటుకు వచ్చి ఆమోదం పొందుతుందని, డిసెంబర్లో బిల్లు పార్లమెంటులో ప్రతిపాదించకపోతే కాంగ్రెస్ కావాలని జాప్యం చేస్తుందని అనుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. నవంబర్ పదో తేదీన తలపెట్టిన ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడి కార్యక్రమాన్ని డిసెంబర్ పదో తేదీకి వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు. నవంబర్ 13వ తేదీ నుంచి రెండో విడత రథయాత్ర సాగుతుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
