తెలంగాణకు మేడం సానుకూలం: ఎమ్మెస్సార్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సానుకూలంగా ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, ఏపీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్ ఎం.సత్యనారాయణరావు అన్నారు. ఇటీవల ఆయన ఢిల్లీలో సోనియాగాంధీతో సమావేశమైన సంగతి తెలిసిందే. ప్రత్యేక తెలంగాణపై ప్రణబ్ కమిటీ కూడా సానుకూలంగానే ఉందని ఆయన వెల్లడించారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే ఈ అంశంపై బిల్లు పెట్టే అవకాశముందని ఆయన తెలిపారు. బిల్లు పెడితే రాష్ట్రంలో ఎలాంటి పొత్తులు లేకుండానే కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేసి పూర్తి మెజారిటీతో గెలిచితీరుతుందని సోనియాగాంధీకి వివరించినట్టు ఆయన తెలిపారు.
ఉపాధ్యాయులు సమ్మె ప్రభుత్వానికి మంచిది కాదని ఆయన అన్నారు. ఉపాధ్యాయుల సమ్మెను పరిష్కరించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తాను ఉపాధ్యాయులకు అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. కరీంనగరులోని సత్యనారాయణరావు ఇంటిని ఉపాధ్యాయులు ఆదివారంనాడు ముట్టడించారు.












Click it and Unblock the Notifications
