మంత్రుల ఇళ్ల వద్ద టీచర్ల ధర్నా
హైదరాబాద్: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఐక్య ఉపాధ్యాయ కార్యాచరణ సమితి (జాక్టో) ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సమ్మె ఆదివారం ఉధృత రూపం దాల్చింది. మెదక్ జిల్లాలోని పాఠశాల విద్యా మంత్రి దామోదర రాజనర్సింహ ఇంటిని ముట్టడించడానికి ఉపాధ్యాయులు ప్రయత్నించారు. ఉపాధ్యాయులు దశల వారీగా వస్తూ మంత్రి ఇంట్లోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అరెస్టు చేసి సంగారెడ్డి రూరల్ పోలీసు స్టేషనుకు తరలించారు. ఈ సమయంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు మంత్రులు, కాంగ్రెసు శాసనసభ్యుల ఇళ్ల ముందు ధర్నాలు చేశారు. మంత్రులు రోశయ్య, మారెప్ప, కాసు వెంకట కృష్ణారెడ్డి, షబ్బీర్ అలీ తదితర మంత్రుల ఇళ్ల ముందు ధర్నాలు చేశారు. మంచిర్యాలలో మంత్రి వినోద్ ను ఘెరావ్ చేశారు. ఉపాధ్యాయ ప్రతినిధులను మంత్రి రాజనర్సింహ తొలుత ఆదివారం మధ్యాహ్నం చర్చలకు ఆహ్వానించారు. కానీ, ఆ తర్వాత వాటిని వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications
