ఎన్టీఆర్ పై ఏదేదో రాస్తున్నారు: బాబు

జూనియర్ ఎన్టీఆర్ విషయంపై పత్రికలు ఇష్టమొచ్చినట్లుగా రాస్తున్నాయని, వాటికి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయని మనసంతా యువగర్జన మీదే ఉంది, అనివార్య కారణాల వల్ల పాల్గొనలేకపోతున్నానని ఎన్టీఆర్ తనతో అన్నారని, ఎన్నికల ప్రచారానికి వస్తానని చెప్పారని ఆయన వివరించారు. కుటుంబ సభ్యులమంతా కూర్చునే దీనిపై నిర్ణయం తీసుకున్నామని, పార్టీకి, కుటుంబానికి మధ్య మరింత సమన్వయానికి ప్రయత్నిస్తున్నానని ఆయన చెప్పారు.
యువగర్జన కోసం రాష్ట్రమంతా ఉత్సాహంగా ఎదురుచూస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. రాజకీయ చైతన్యానికి ప్రతీకయిన గుంటూరులో జరుగుతున్న ఈ భారీ బహిరంగ సభ చరిత్ర సృష్టిస్తుందని అన్నారు. చరిత్రాత్మక సమావేశంగా నిలిచిపోతుందని ఉద్ఘాటించారు. ప్రపంచ చరిత్ర చూస్తే అవినీతిపై పోరాడుతోంది యువతే. రాష్ట్రంలో విచ్చలవిడిగా జరుగుతున్న అవినీతిపై వారే పోరాడాలని, ఎంత అవినీతికి పాల్పడ్డా ఏమీ కాదని ముఖ్యమంత్రి వైఎస్ ధీమాగా ఉన్నారని, అవినీతిని ప్రతిఒక్కరూ స్వయంగా చూస్తున్నారని, దాని ఫలితం అనుభవిస్తున్నారని, ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు. అక్టోబరు 2న గాంధీజీ జయంతి సందర్భంగా అవినీతి వ్యతిరేక పోరాటాన్ని ప్రారంభించామని, నవంబరు చివరి వరకు ప్రతి గ్రామానికి దీన్ని తీసుకెళ్తామని, ఈ పోరాటంలో భాగంగానే యువగర్జన నిర్వహిస్తున్నామని, యువగర్జనకు నందమూరి కుటుంబసభ్యులు వస్తున్నారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
