మావోయిస్టులతో చర్చిస్తాం: చిరు పార్టీ

Chiranjeevi
హైదరాబాద్‌: చిరంజీవి తెలంగాణ పర్యటన నేపథ్యంలో ప్రజారాజ్యం పార్టీ మావోయిస్టుల విషయంలో తమ వైఖరిని ప్రకటించింది. పీఆర్పీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కాల్పుల విరమణ పాటించి మావోయిస్టులతో చర్చిస్తామని పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్‌ మిత్రా చెప్పారు. పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లడుతూ ఈ సమస్యపై తమ పార్టీకి స్పష్టమైన వైఖరి ఉందన్నారు. ఈ విషయంలో ఐదు అంశాల ప్రాతిపదికగా పీఆర్పీ విధానం ఉంటుందని తెలిపారు.

కాల్పుల విరమణ, బూటకపు ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ, పోరాటావిర్భావానికి మూలకారణాలైన వెనకబాటుతనం, గిరిజనుల భూ ఆక్రమణలు, వనసంపద వినాశనం, గిరిజనులను దోచుకునే విధానాలను రూపుమాపడం, జనజీవన స్రవంతిలోకి వచ్చే మావోయిస్టులకు పునరావాసం కల్పించి సహకరించటంతో పాటు రాష్ట్రంలో చట్టానికి, రాజ్యాంగానికి విఘాతం కలిగించకుండా శాంతిభద్రతల విషయంలో రాజీ పడకుండా కచ్చితంగా వ్యవహరించటం తమ విధాన మని తెలిపారు.

మావోయిస్టుల సమస్యను శాంతిభద్రతల సమస్యగా కాకుండా సామాజక, ఆర్థిక, రాజకీయ సమస్యగా పరిగణిస్తామన్నారు. ఈ విషయమై పార్టీ అధ్యక్షుడు చిరంజీవి అధ్యక్షతన అనుభవజ్ఞులతో మరింత లోతుగా చర్చించి విధివిధానాలను ప్రకటిస్తామని తెలిపారు. ఒకసారి కాంగ్రెస్‌ ప్రభుత్వంతో చర్చించి మోసపోయిన మావోయిస్టులు మీ మాటలు విశ్వసిస్తారని భావిస్తున్నారా అని ప్రశ్నించగా తాము చిత్తశుద్ధి, నిజాయితీలతో తమ విధానాన్ని ప్రకటిస్తున్నందున ప్రజలు నమ్ముతున్నట్లే వారు కూడా విశ్వసిస్తారన్న నమ్మకం తమకుందని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+