సిట్టింగ్ జడ్జితో విచారణకు డిమాండ్
హైదరాబాద్: రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖా మంత్రి జెసి దివాకర్ రెడ్డిపై లఘు పరిశ్రమల మంత్రి గొల్లపల్లి సూర్యారావు చేసిన ఆరోపణల మీద సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు. మంత్రుల కమిటీ విచారణను ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తప్పు పట్టారు. వారిలో వారే కమిటీ వేసుకుని విచారణ నిర్వహించుకోవడం సరి కాదని, అలా నిర్వహించుకోవడానికి ఇదేం వారి కాంగ్రెస్ పార్టీ సమస్య మాత్రమే కాదని ఆయన అన్నారు.
తూర్పూ గోదావరి జిల్లాలో ఇసుక కుంభకోణం వ్యవహారం ప్రజలకు సంబంధించిందని ఆయన అన్నారు. ఇసుక కుంభకోణంలో ప్రభుత్వ ఖజానాకు వంద కోట్ల రూపాయల గండి పడుతోందని ఆయన అన్నారు. తాము అవినీతి గురించి మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి తమను తప్పు పడుతున్నారని, ఇప్పుడు మంత్రులే పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకుంటున్నారని, అవినీతికి సంబంధించి ఇది కేవలం మచ్చు మాత్రమేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
