నలుగురు నక్సల్స్ హతం
హైదరాబాద్: రాష్ట్రంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన రెండు ఎదురుకాల్పుల్లో నలుగురు నక్సల్స్ హతమయ్యారు. చాలా కాలం తర్వాత రాష్ట్రంలో మావోయిస్టుల ఎన్ కౌంటర్స్ చోటు చేసుకున్నాయి. గుంటూరు జిల్లా నల్లమల అడవుల్లోని బొల్లాపల్లిలో పోలీసులకు, నక్సల్స్ కు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.
బొల్లాపల్లి ఎదురుకాల్పుల్లో మరణించిన ఇద్దరు మావోయిస్టులను పోలీసులు గుర్తించారు. గుత్తికొండబిలం దళ కమాండర్ మీసాల ప్రభాకర్, దళ సభ్యురాలు నాగమణిలుగా వారిని గుర్తించారు. సంఘటనా స్థలం నుంచి ఒక ఎకె 47 రైఫిల్ ను, తపంచాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. ఈ ఎన్ కౌంటర్ విజయనగరం జిల్లా రావికోనలో జరిగింది.












Click it and Unblock the Notifications
