ఇసుక స్కాం నాకేం తెలియదు: జెసి

మంత్రుల కమిటీ మంగళవారం రోశయ్య నివాసంలో సమావేశమై దివాకర్ రెడ్డి వాదనలను విన్నది. తనపై గొల్లపల్లి సూర్యారావు చేసిన ఆరోపణల్లో నిజం లేదని దివాకర్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. జిల్లాలో ఏదైనా జరిగినప్పుడు తనొక్కడ్నే ఎలా బాధ్యుడ్ని అవుతానని, జిల్లా మంత్రిగా సూర్యారావు ఆ విషయాన్ని అరికట్టాల్సిన అవసరం లేదా అని ఆయన అన్నట్లు తెలుస్తోంది. తాను జిల్లా ఇంచార్జీ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంభవించిన పరిణామాలను ఆయన కమిటీకి వివరించినట్లు తెలుస్తోంది. మంత్రుల కమిటీ సోమవారంనాడు గొల్లపల్లి సూర్యారావు వాదనలు విన్నది.












Click it and Unblock the Notifications
