అసూయ: ఒక బ్లూ ఫిల్మ్ కథ- రోజా

తాను తెలుగుదేశం రాజకీయాల్లో ఎదుగుతున్న దశలో తనలాగ ఉండే ఒక మహిళ నటించిన బ్లూఫిల్మ్ ను కొందరు ఎన్టీఆర్ ట్రస్టు భవన్ కు పంపించారని, అటువంటి వాటికి తాను భయపడలేదని రోజా చెప్పారు. చంద్రబాబు నాయుడు కూడా ఆ పరిస్ధితిని సహృదయంతో అర్ధం చేసుకున్నారని ఆమె అన్నారు. తనకు శత్రువులు అనదగిన వారు లేకపోయినా అసూయా పరుల నుంచి ఈ విధమైన థ్రెట్స్ ఉంటాయని ఆమె చెప్పారు. తెలుగుదేశం పార్టీకి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆదరణ ఇప్పటికీ తగ్గలేదని, ఇంకా పెరుగుతోందని ఆమె అన్నారు.
తాను ఏదో ఆశించి రాజకీయాల్లోకి రాలేదని, ప్రజల సమస్యలను కొంతవరకైనా తీర్చే అవకాశం రాజకీయాల్లో ఉండబ ట్టి వచ్చానని రోజా సెలవిచ్చారు. పార్టీ కార్యాలయాల్లో సౌకర్యంగా ఉండడం వేరని, సమస్యాత్మక ప్రాంతాలైన గ్రామాలను సందర్శించి ప్రజలను పలకరించడం వేరని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications
