ఖాళీ ప్రమిదలతో టీచర్ల ప్రదర్శన
హైదరాబాద్: తమ డిమాండ్ల సమస్య పరిష్కారానికి రాష్ట్రంలోని ఉపాధ్యాయులు దీపావళి పర్వదినం సందర్భంగా మంగళవారం వినూత్న రీతిలో నిరసన ప్రదర్శన చేశారు. వారు హైదరాబాదులోనే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఖాళీ ప్రమిదలతో ప్రదర్శనలు నిర్వహించారు. హైదరాబాదులో బషీర్ బాగ్ నుంచి వారు ర్యాలీ నిర్వహించారు.
తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయులు ప్రారంభించిన సమ్మె మంగళవారంనాటికి ఏడో రోజుకు చేరుకుంది. ఇప్పటికైనా తమను ప్రభుత్వం చర్చలకు అహ్వానించి తమ సమస్యలను పరిష్కరించాలని ఐక్య ఉపాధ్యాయ కార్యాచరణ సమితి (జాక్టో) నేతలు డిమాండ్ చేస్తున్నారు. అందరూ దీపావళి పండుగ జరుపుకుంటుంటే తమ జీవితాలు చీకట్లో ఉండిపోయాయని వారన్నారు. తమ సమస్యల పరిష్కారంలో విజ్ఞత ప్రదర్శించాలని వారు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications
