గోరఖ్ పూర్ ఎక్స్ ప్రెస్ లో పొగలు
కరీంనగర్: కరీంనగర్ జిల్లా రామగుండం రైల్వే స్టేషన్ వద్ద గోరఖ్ పూర్ ఎక్స్ ప్రెస్ ఇంజన్లు పొగలు లేచాయి. బెంగుళూర్ నుంచి గోరఖ్ పూర్ వెళ్తున్న ఈ ఎక్స్ ప్రెస్ రైలు రామగుండం చేరుకోగానే ఇంజన్ లోంచి మంటలు రావడం ప్రారంభమైంది. దీంతో రైలును ఆపేసి తనిఖీ చేశారు. ఈ ప్రమాదంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
బ్రేకులు ఫెయిల్ కావడం వల్లనే సమస్య తలెత్తినట్లు రైల్వే సిబ్బంది గుర్తించారు. దీంతో దాదాపు 25 నిమిషాల పాటు రైలు ఆగిపోయింది. బ్రేకులు సరిచేసిన తర్వాత రైలు తిరిగి బయలుదేరి వెళ్లింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications
