కోర్టు ఆదేశాలను ధిక్కరించిన రాజ్

Raj Thackeray
ముంబయి: కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ మహారాష్ట్ర నవనిర్మాణ సమితి (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే నోరు విప్పారు. మాహారాష్ట్ర ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు ఒడిగడుతోందని ఆయన విమర్శించారు. తన జడ్ ప్లస్ కెటగిరీ భద్రతను ఉపసంహరించడం మూర్ఖత్వమేనని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన మరాఠీ దినపత్రిక లోక్ సత్తాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఉత్తరాది వారిపై దాడి విషయంలో తనపై హత్యా కేసు నమోదైనందున భద్రతను ఉపసంహరించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

తన ప్రాణాలకు ముప్పు ఉందని, బస్సు కాల్పుల సంఘటన ఈ విషయాన్ని తెలియజేస్తోందని, బంటీ పాండే అనే నేరస్థుడి నుంచి కూడా తనకు బెదిరింపులు వచ్చాయని ఆయన చెప్పారు. తాను ఎన్నడూ పోలీసు భద్రతను కోరలేదని, తన ప్రాణాలకు ముప్పు ఉందనే ఉద్దేశంతో ప్రభుత్వమే 1992లో భద్రత కల్పించిందని, ఇప్పుడు ఏ కారణం లేకుండా ఉపసంహరించుకుందని ఆయన చెప్పారు. మాలేగావ్ లాంటి ప్రాంతాల్లో తమ సంస్థ కార్యకర్తలను మరాఠీయేతర పోలీసులు తీవ్రంగా కొట్టారని ఆయన ఆరోపించారు. తాను మరాఠీల ఆత్మగౌరవం కోసం పోరాడుతూనే ఉంటానని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+