న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లోపే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై కాంగ్రెస్ అధిష్టానవర్గం ఒక నిర్ణయం తీసుకుంటుందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి వీరప్ప మొయిలీ బుధవారం ఉదయం ఢిల్లీలో ప్రకటించారు. వివిధ అంశాలపై అధిష్టానవర్గంతో చర్చించేందుకు ఢిల్లీ వచ్చిన ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి వీరప్ప మొయిలీతో తెలంగాణ అంశంపై ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ తీర్మానం చేయడం, టిడిపి, టీఅర్ ఎస్ ల మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉండడంతో కాంగ్రెస్ అధిష్టానవర్గంపై ఈ విషయంపై వత్తిడి అధికమైంది. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు అనవరంగా యుపిఎ ను విడిచి వెళ్ళారని వీరప్ప మొయిలీ నేడు వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.