పాక్ లో భూకంపం: 80 మంది మృతి
కరాచీ: పాకిస్థాన్ ను బుధవారం ఉదయం భూకంపం కుదిపేసింది. దీని తాకిడికి దాదాపు 80 మంది మరణించినట్లు అనుమానిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. క్వెట్టాకు 70 కిలోమీటర్ల దూరంలో భూకంపం బుధవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. రెక్టార్ స్కేల్ పై ఇది 6.2గా నమోదైనట్లు అమెరికా భూభౌతిక సర్వే తెలియజేసింది. దీని తీవ్రత రెక్టార్ స్కేల్ పై 6.1 ఉన్నట్లు పాకిస్తాన్ వాతావరణ పరిశోధనా శాఖ తెలియజేసింది.
భూకంపానికి రెండు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బ తిన్నట్లు జియారత్ జిల్లా చీఫ్ దిలావర్ ఖాన్ చెప్పారు. భూకంప తీవ్రతకు పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రజలు ఇళ్లు విడిచి పరుగులు తీశారు. ఈ ప్రాంతంలో 1935లో వచ్చిన భూకంపానికి 30 వేల మంది బలయ్యారు. 2005లో తాకిన భూకంపానికి 75 వేల మంది బలయ్యారు.












Click it and Unblock the Notifications
