మూడు రోజుల్లో నోరు విప్పుతా: జెసి

రోశయ్యను కలిసి వచ్చిన జెసి దివాకర్ రెడ్డిని మీడియా ప్రతినిధులు చుట్టుముట్టారు. దీంతో ఇదేమిటి ఘెరావ్ చేసినట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. గొల్లపల్లి సూర్యారావు తాజాగా చేసిన ఆరోపణలపై ప్రస్తావించగా కొత్తగా మాట్లాడుతున్నదేమీ కాదు గదా అని ఆయన అన్నారు. తాను ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి అన్నీ వివరించానని, ముఖ్యమంత్రి మాట కోసం ఎదురు చూస్తున్నానని ఆయన చెప్పారు. తాను రోశయ్యకు అన్నీ చెప్పానని, ఆ తర్వాత జరిగిన పరిణామాలేమిటో తనకు తెలియదని, రోశయ్య చెప్పింది టీవీలో విన్నానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
