వైయస్ పై యాష్కీ, కెసిఆర్ పై నరేంద్ర

మతాన్ని అడ్డు పెట్టుకుని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును అడ్డుకునేందుకు తమ పార్టీలోని కొందరు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని ఉద్దేశించి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఓడిపోతుందని వాదించినవారు తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో ముస్లింలను అడ్డు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సమైక్యాంధ్రకే కట్టుబడి ఉంటే వారు దాన్ని నేరుగా చెప్పవచ్చునని, అడ్డదారుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును అడ్డుకునే ప్రయత్నం మంచిది కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
