తెలంగాణపై చర్చకు ఢిల్లీకి వైయస్

YS Rajasekhar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి బుధవారం ఢిల్లీకి బయలు దేరి వెళ్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని, ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, తెలంగాణ కమిటీ చైర్మన్ ప్రణబ్ ముఖర్జీని ఆయన కలుస్తారు. తెలంగాణపై చర్చ కోసమే ముఖ్యమంత్రిని పార్టీ అధిష్ఠాన వర్గం ఢిల్లీకి పిలిచినట్లు సమాచారం.

ఎన్నికలు సమీపిస్తుండడంతో తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్యతలో కాంగ్రెస్ పడింది. ఈ స్థితిలో ముఖ్యమంత్రితో కాంగ్రెస్ పెద్దలు విస్తృత చర్చలకు సిద్ధపడినట్లు అర్థమవుతోంది. ఆయన ఢిల్లీకి వెళ్లి వచ్చి రెండు రోజులు కూడా కాలేదు. అప్పుడే మళ్లీ పిలుపు వచ్చింది. సాధ్యమైనంత తొందరగా తెలంగాణపై తేల్చాల్సిన అవసరం ఉందని పార్టీ అధిష్ఠానం గుర్తించడమే అందుకు కారణమని అంటున్నారు. డిసెంబరులో పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లును ప్రతిపాదించే అవకాశం ఉందని ఇటీవల కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు ఎం. సత్యనారాయణరావు చెప్పిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+