టీచర్లను మోసం చేస్తోంది: బాబు
హైదరాబాద్ : రెండు వారాలుగా ఉపాధ్యాయులు చేస్తున్న సమ్మెకు తెలుగుదేశం పూర్తిమద్దతు ప్రకటించింది. ఇందిరాపార్క్ వద్ద ఉపాధ్యాయసంఘాలు నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఆదివారంనాడు పాల్గొన్నారు.నిరాహారదీక్ష చేస్తున్న వారిని ఆయన పరామర్శించారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు విద్యారంగానికి ఎనలేని ప్రాముఖ్యతను ఇచ్చామని ఆయన తనప్రసంగంలో పేర్కొన్నారు. బాబుతో పాటు తెలుగుదేశం ఎంపీ ఎర్రన్నాయుడు, పలువురు తెలుగుదేశం నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయులను మోసం చేస్తోందని చంద్రబాబు విమర్శించారు. ఉపాధ్యాయులు కోర్కెలు న్యాయమైనవని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధ్యాయులు సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఉపాధ్యాయుల సమ్మెను పరిష్కరించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆరోపించింది. ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేందుకే ప్రభుత్వం వ్యవహరిస్తోందని సంఘాల నేతలు పేర్కొన్నారు. న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మెబాటపట్టిన ఉపాధ్యాయులకు పూర్తిమద్దతు ఇస్తున్నట్టు వేదిక ప్రకటించింది.












Click it and Unblock the Notifications
