నాణ్యమైన జీవితం అందిస్తాం: చిరు
కరీంనగర్: తమ పార్టీని గెలిపిస్తే ప్రజలకు సుఖమయమైన జీవితాన్ని అందిస్తామని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి చెప్పారు. ఆయన ప్రజా అంకిత యాత్ర మూడో రోజు ఆదివారం కరీంనగర్ జిల్లాలో సాగింది. ప్రజలకు నాణ్యమైన జీవితాన్ని అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. తమ పార్టీ ప్రజలు తమను తామే పాలించుకునే అవకాశాన్ని కల్పిస్తుందని కూడా హామీ ఇచ్చారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ధరలు పెరుగుతున్నాయని ఆయన విమర్శించారు. తమ పార్టీకి ప్రజలే అండదండలని ఆయన చెప్పారు. ప్రజలకు విద్య వైద్యం వంటి సదుపాయాలు కల్పిస్తామని ఆయన చెప్పారు.
సామాజిన న్యాయం అందించడమే తమ పార్టీ లక్ష్యమని ఆయన చెప్పారు. తాను రాజకీయాల్లోకి వచ్చే అవకాశాన్ని ప్రజలే కల్పించారని ఆయన అన్నారు. సినిమాల్లో హీరోగా ఉండడమనేది ఒక వేదిక కాదని, ప్రజలకు సేవ చేసే అవకాశం రావడమే అదృష్టమని, తనకు ఆ అపూర్వ అవకాశం వచ్చిందని ఆయన చెప్పారు. ఆదివారంనాడు ఆయన యాత్ర కరీంనగర్ జిల్లాలో ముగుస్తుంది. అనంతరం వరంగల్ జిల్లాలో ప్రవేశిస్తుంది.












Click it and Unblock the Notifications
