చిరు ప్రకటనకు కాంగ్రెస్ ఎంపీ స్వాగతం
రాజమండ్రి: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ చెప్పారు. రాష్ట్రం విడిపోతేనే మంచిదని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుతో అన్నారు. రాష్ట్రం ఏర్పడితే కోస్తాంధ్రకు మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తన అభిప్రాయాన్ని తాను తమ పార్టీ అధిష్ఠానవర్గానికి చెప్పినట్లు ఆయన తెలిపారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ తీర్మానం చర్చకు వచ్చే తాను మద్దతిస్తానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
