యువగర్జనకు ఎన్టీఆర్ వస్తాడు: హరికృష్ణ

విజయవాడ : యువగర్జన రాష్ట్రంలో కొత్తచరిత్రను సృష్టించనుందని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు నందమూరి హరికృష్ణ అన్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ తప్పకుండా యువగర్జనకు వస్తారని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసింది ఏమిలేదని ప్రజాసమస్యలను గాలికి వదిలేసి అవినీతే పరమావధిగా పాలన సాగిస్తోందని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. రాష్ట్రం నుంచి కాంగ్రెస్‌ను తరిమికొట్టేంతవరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని ముఖ్యమంత్రిని చేయడానికే తాము కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు. చంద్రబాబు చిత్రం ఉన్న యువగర్జన సదస్సు పోస్టర్ చిరిగిపోవడంపై వివాదం చేలరేగింది. అలాగే కొన్ని పోస్టర్లపై చంద్రబాబు చిత్రం లేదు. దీనిపై కూడా హరికృష్ణ వివరణ ఇచ్చారు. అభిమానులు తమ ఇష్టప్రకారం పోస్టర్లు వేసుకుంటారని ఆయన అన్నారు. తమలో విభేదాలు లేవని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+