తెలంగాణకు ఎప్పుడూ కష్టాలే: జయప్రద
ఆదిలాబాద్: తెలంగాణ ప్రజలు ఎప్పుడూ కష్టాల్లోనే ఉంటున్నారని సమాజ్ వాదీ పార్టీ పార్లమెంటు సభ్యురాలు జయప్రద అన్నారు. తమ పార్టీ అగ్రనాయకులు ములాయం సింగ్ యాదవ్, అమర్ సింగ్ లతో కలిసి ఆమె ఆదివారం ఆరుగురు సజీవదహనమైన ఆదిలాబాద్ జిల్లాలోని వటోలీ గ్రామాన్ని సందర్శించారు. వారి వెంట మజ్లీస్ పార్టీ నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ కూడా ఉన్నారు. వటోలీ సంఘటన నిందితులను ఇప్పటి వరకు అరెస్టు చేయలేకపోయారని ములాయం సింగ్ అన్నారు.
దేశంలో ముస్లింలకు రక్షణ లేకుండా పోయిందని అమర్ సింగ్ విమర్శించారు. వటోలీ బాధితులకు వంద శాతం నష్టపరిహారం చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఢిల్లీ, మహారాష్ట్ర, అసోం వంటి రాష్ట్రాల్లో ముస్లింలకు రక్షణ లేకుండా పోయిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
