టీచర్ల సమ్మె కాంగ్రెసుకు నష్టం: విహెచ్
హైదరాబాద్: ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించకపోతే తమ పార్టీకి నష్టం జరుగుతుందని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి ఒక లేఖ రాశారు. ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు. అన్ని వర్గాల ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్న ముఖ్యమంత్రి ఉపాధ్యాయుల సమస్యలను కూడా పరిష్కరించాలని ఆయన కోరారు.
ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించకపోతే కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో నష్టపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉపాధ్యాయుల డిమాండ్లను మానవతా దృక్పథంతో పరిశీలించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయులు గ్రామ రాజకీయాలను కూడా ప్రభావితం చేయగలరని, సమస్యలను పరిష్కరించకపోతే వారు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
