మావోల పేలుడు: తప్పించుకున్న బుద్ధదేవ్
కోల్ కత్తా: మావోయిస్టుల మందుపాతర నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య తృటిలో తప్పించుకున్నారు. రాష్ట్రంలోని వెస్ట్ మిడ్నాపూర్ జిల్లా శల్బోనీలో ఈ సంఘటన జరిగింది. బుద్దదేవ్ భట్టాచార్య కాన్వాయ్ లోని ఆరుగురు పోలీసులు గాయపడ్డారు. బుద్ధదేవ్ ప్రయాణిస్తున్న వాహనం దాటిన తర్వాత మందుపాతర పేలడంతో ఆయన ఈ ప్రమాదం నుంచి బయట పడ్డారు. కేవలం నాలుగు నిమిషాల వ్యవధిలోనే ఆయనకు ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. ఈ పేలుడుకు ఒక పోలీసు వాహనం ధ్వంసమైంది. శల్బోనీలోని జిందాల్ స్టీల్ కర్మాగారానికి శంకుస్థాపన చేసి వస్తుండగా మావోయిస్టులు బుద్ధదేవ్ ను లక్ష్యంగా చేసుకుని మందుపాతర పేల్చారు. బుద్ధదేవ్ భట్టాచార్య చాలా కాలంగా మావోయిస్టుల హిట్ లిస్టులో ఉన్నారు. బుద్ధదేవ్ తో కేంద్ర ఉక్కు మంత్రి రాం విలాస్ పాశ్వాన్ కూడా ఉన్నారు.












Click it and Unblock the Notifications
