ఆంధ్రజ్యోతిపై యూత్ కార్యకర్తల వీరంగం
హైదరాబాద్ : ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని ఆరోపిస్తూ హైదరాబాదు నగరంలోని ఆంధ్రజ్యోతి దినపత్రిక కార్యాలయం ఎదుట యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రాజశేఖర చరితము అంటూ ధారావాహికంగా ప్రచురితమవుతున్న కథనాలన్ని నిరసిస్తూ వారు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.
ఆదివారంనాడు తన ధారావాహిక వార్తా కథనాల్లో భాగంగా ఆంధ్రజ్యోతి మనిషంటే ఓటే అనే కధనాన్ని ప్రచురించింది. దీన్ని నిరసిస్తూ యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో తమ నాయకుడి వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసే కథనాలను ఆంధ్రజ్యోతి పనిగట్టుకుని రాస్తోందని యువజన కాంగ్రెస్ కార్యకర్తలు విమర్శించారు. తమ నాయకుడిని దెబ్బ తీయాలనుకుంటే పత్రికనే అంతమవుతుదని వారన్నారు. యువజన కార్యకర్తల చర్యను తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ (టిడిపిపి) నాయకుడు కె. ఎర్రంనాయుడు ఖండించారు. ఇది పత్రికా స్వేచ్ఛపై దాడి అని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
