సూరి పాత్రపై చెప్పలేను: శీను భార్య
గుంటూరు: తన భర్త హత్య వెనక కుట్ర ఉందని మొద్దు శీను భార్య లక్ష్మీరాజ్యం ఆరోపించింది. భర్త హత్య సమాచారం తెలిసిన వెంటనే ఆమె గుంటూరు జిల్లాలోని నర్సారావుపేట సమీపంలోని స్వగ్రామం చల్లగుండ్లకు వచ్చింది. జైళ్ల అధికారుల ప్రమేయం లేకుండా ఈ హత్య జరిగి ఉండదని ఆమె మీడియా ప్రతినిధులతో అన్నది. తనకు సూరి నుంచి ప్రాణహాని ఉన్నదని మొద్దు శీను తనకు ఎప్పుడూ చెప్పలేదని ఆమె అన్నది.
మొద్దు శీను హత్యలో సూరి పాత్ర ఉందని చెప్పలేనని ఆమె అన్నది. విచారణ జరిపిస్తే అసలు విషయం బయట పడుతుందని ఆమె అన్నది. విచారణలో ఏది తేలితే అది నమ్మడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఆమె తెలిపింది. తన భర్త హత్యకు గురైనట్లు అధికారుల నుంచి తనకు ఎటువంటి సమాచారమూ లేదని, టీవీల్లో చూసి తెలుసుకున్నానని ఆమె చెప్పింది.












Click it and Unblock the Notifications
