తెలంగాణపై అహ్మగ్ పటేల్ భరోసా: నరేంద్ర
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ భరోసా ఇచ్చినట్లు తెలంగాణ రాష్ట్ర సమితి (ఎన్) అధ్యక్షుడు ఎ. నరేంద్ర చెప్పారు. ఆయన ఆదివారంనాడు అహ్మద్ పటేల్ ను కలిశారు. తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని తాను నమ్ముతున్నానని, అయితే మిగతా వారిని నమ్మించాల్సిన అవసరం ఉందని తాను అహ్మద్ పటేల్ తో చెప్పినట్లు ఆయన తెలిపారు. ఎవరినీ నమ్మించాల్సిన అవసరం లేదని, తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటున్నామని అహ్మద్ పటేల్ చెప్పినట్లు ఆయన అన్నారు.
ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు పూర్తి కాగానే డిసెంబరులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణపై నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు. తెలంగాణపై తాము సీరియస్ గా ఆలోచిస్తున్నామని, తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటామని అహ్మద్ పటేల్ చెప్పినట్లు ఆయన తెలిపారు. నరేంద్ర ఇటీవల ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ను కూడా కలిసిన విషయ తెలిసిందే.












Click it and Unblock the Notifications
