టిడిపివారో, సూరో తేలాలి: శీను భార్య
గుంటూరు: తన భర్త హత్యపై అనుమానాలు తలెత్తుతున్నాయని మొద్దు శీను భార్య లక్ష్మీరాజ్యం అంటోంది. మొద్దు శీను మృతదేహం గుంటూరు జిల్లాలోని స్వస్థలం చల్లగుండ్లకు చేరుకుంది. వార్తాకథనాలు చూసిన తర్వాత తనకు పలు అనుమానాలు తలెత్తుతున్నాయని, ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సమగ్ర విచారణ జరిపిస్తే నిజాలు వెల్లడవుతాయని ఆమె అంటోంది. తన భర్త హత్య వెనక తెలుగుదేశం పార్టీవారు ఉన్నారా, మద్దెలచెర్వు సూరి ఉన్నాడా తేలాలని ఆమె అంటోంది.
మొద్దు శీను హత్యపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. మొద్దు శీను బంధువులు కూడా ఈ అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. తలపై బలమైన వస్తువుతో కొట్టడం వల్లనే మొద్దు శీను మరణించాడని వైద్యులు పోస్టుమార్టంలో తేల్చారు. అయితే, మొద్దు శీనును కాల్చి చంపి ఉంటారని ఆయన బంధువులు అంటున్నారు. తాము ఎవరం లేకుండా పోస్టుమార్టం నిర్వహించడం కూడా మొద్దు శీను హత్యపై అనుమానాలకు తావిస్తోందని వారంటున్నారు.












Click it and Unblock the Notifications
