ముంబయి పాత గాయాలివి
భారత ఆర్థిక రాజధానిగా పేరు పొందిన ముంబయిని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో వరుస బాంబు పేలుళ్లకు పాల్పడడం వారు ఒక పనిగా పెట్టుకున్నారు. ముంబయిలో వరుస బాంబు పేలుళ్ళకు 1993లో మారణహోమంతో ఉగ్రవాదులు శ్రీకారం చుట్టారు. ముంబయిలో ఉగ్రవాదులు జరిపిన పేలుళ్ల సంఘటనలు ఇలా ఉన్నాయి.
* 1993 మార్చి 12: ముంబయిలో స్టాక్ ఎక్చేంజితోసహా 13 వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. 257 మంది మరణించారు. 713 మంది గాయపడ్డారు.
*2003 ఆగస్టు 25: ముంబయిలో గేట్‌వే ఆఫ్ ఇండియా, జవేరీ బజార్‌లో టాక్సీ బాంబులు పేలాయి. భోజనాల సమయంలో ఈ సంఘటన జరగడంతో 54 మంది మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. 100 మంది గాయపడ్డారు.
*2006 జులై11: ముంబయి సబర్బన్ ట్రైన్‌లలో 19 నిమిషాల వ్యవధిలో ఏడుచోట్ల బాంబులు పేలాయి. బాంద్రా, మహీం, మాతుంగా, బోరీవలి, మీరారోడ్డు, జోగేశ్వరి, ఖార్‌ల వద్ద పేలుళ్ల తీవ్రతకు మొత్తం 209 మంది మరణించారు. 439 మంది గాయపడ్డారు.












Click it and Unblock the Notifications
