మేమే చేశాం: దక్కన్ ముజాహిదీన్

ముంబయి: ముంబయిలో దాడులకు తామే పాల్పడ్డామని దక్కన్ ముజాహిదీన్ అనే సంస్థ ప్రకటించుకుంది. ముంబయి అంతటా తామే దాడులకు పాల్పడ్డామని దక్కన్ ముజాహిదీన్ పేర మీడియాకు ఇ-మెయిల్స్ వచ్చాయి. పేలుళ్లు జరిగిన ఆరు గంటల తర్వాత దక్కన్ ముజాహిదీన్ పేర తామే బాధ్యలమంటూ మీడియాకు ఇ-మెయిల్స్ వచ్చాయి. ఈ సంస్థ పేరు వినడం ఇదే మొదటిసారి.

సిమి గానీ, ఇండియన్ ముజాహిదీన్ గానీ ఈ పేరు మీద దక్కన్ ముజాహిదీన్ పేరు మీద పని చేస్తూ ఉండవచ్చునని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. దాడులు చేసిన విధానం సిమీ కార్యకలాపాలను పోలి ఉంది. ఈ దాడులకు సంబంధించి పోలీసులు 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిచ్చే సమాచారాన్ని బట్టి ఈ సంస్థ సమాచారం తెలిసే అవకాశం ఉంది. టెర్రరిస్టులు తమపై దృష్టిని కేంద్రీకరింపజేసుకునేందుకే విదేశీ పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్నట్లు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+