దేశ భద్రతకు సవాల్: సోనియా

Sonia Gandhi
న్యూఢిల్లీ: ఉగ్రవాదులు దేశానికి శత్రువులని, ముంబయి ఉగ్రవాద దాడులు దేశానికి సవాల్ విసిరాయని, దీన్ని జాతి యావత్తూ ఒక్కటై ఎదుర్కోవాల్సి ఉందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. ఈ దాడులు దేశ భద్రతకు సంబంధించిన అంశం మాత్రమే కాదని, దేశ గౌరవానికి సవాల్ అని ఆమె అన్నారు. ముంబయి ఉగ్రవాద దాడులను వియత్నాం పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఖండించారు. ఈ దాడులను లోకసభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ కూడా ఖండించారు.

ముంబయి ఉగ్రవాద దాడులు యుద్ధ పరిస్థితిని తలపిస్తున్నాయని హోం శాఖ సహాయ మంత్రి శ్రీప్రకాష్ జైస్వాల్ విలేకరులతో అన్నారు. ఉగ్రవాదులకు తగిన జవాబు చెప్తామని ఆయన అన్నారు. ఈ దాడులకు పాల్పడినవారిని పట్టుకుని తీరుతామని ఆయన అన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ రాత్రి నుంచి పరిస్థితిని సమీక్షిస్తున్నారని, ముఖ్యమంత్రి విలాస్ రావు దేశ్ ముఖ్ తో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారని ఆయన చెప్పారు.

ఉగ్రవాదుల దాడిలో మరిన్ని వారికి ఐదు లక్షల రూపాయలేసి, గాయపడినవారికి 50 వేల రూపాయలేసి నష్టపరిహారం ఇస్తున్నట్లు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్ఆర్ పాటిల్ చెప్పారు. ఈ దాడిని యావత్తు దేశంపై దాడిగా ఆయన అభివర్ణించారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భారతీయులందరూ కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం ఉదయం 11 గంటలకు అత్యవసర మంత్రి వర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉగ్రవాద దాడులపై చర్చించారు. రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ సైనిక బలగాల ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+