ఆరుగురు టెర్రరిస్టుల కాల్చివేత
ముంబయి: జాతీయ భద్రతా సిబ్బంది హోటల్ తాజ్, ఒబెరాయ్ ల్లో ఆరుగురు టెర్రరిస్టులను కాల్చి చంపినట్లు సమాచారం. ఈ హోటల్లో ఉన్న టెర్రరిస్టుల కోసం భద్రతా సిబ్బంది లోనికి ప్రవేశించాయి. దక్షిణ ముంబయిలోని నారిమన్ హౌస్ లో కూడా భద్రతా బలగాలకు, టెర్రరిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో కూడా ఒక టెర్రరిస్టు మరణించినట్లు సమాచారం.
ముంబయి ఎయిర్ ఫోర్సు బ్రిగేడ్, పూణే నుంచి కమెండోలు చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. ముంబయిలో దాడులకు పాల్పడిన పది మంది టెర్రరిస్టులు పాకిస్తాన్ నుంచి వచ్చారు. ముంబయి దాడులకు సంబంధించి 9 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్ఆర్ పాటిల్ చెప్పారు. ఐదుగురు టెర్రరిస్టులను హతమార్చినట్లు, ఒక టెర్రరిస్టును పట్టుకున్నట్లు ఆయన ఒబెరాయ్ హోటల్ ఎదుట మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో చెప్పారు. ఇంకా 40, 50 మంది బందీలతో నలుగురైదుగురు టెర్రరిస్టులు హోటల్లో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. టెర్రరిస్టులు ఒబెరాయ్ హోటల్లోని 19వ అంతస్థులో ఉన్నారు.
గురువారం ఉదయం అదుపులోకి తీసుకున్న అనుమానితుడు లష్కర్ - ఎ -తోయిబాకు చెందినవాడని చెబుతున్నారు. ముంబయిలో దాడుల వెనక ఆ సంస్థ హస్తం ఉందని భావిస్తున్నారు. రష్యా నుంచి లష్కరే తోయిబా పేలుళ్ల తర్వాత ఇ-మెయిల్ పంపినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications
