కెకె కుమారుడు వెంకట్ కు విముక్తి
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) మాజీ అధ్యక్షుడు కె. కేశవరావు కుమారుడు వెంకట్ కు రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రశాంత్ రెడ్డి హత్య కేసు నుంచి విముక్తి లభించింది. ప్రశాంత్ రెడ్డి హత్య కేసును నాంపల్లి కోర్టు గురువారంనాడు కొట్టేసి వెంకట్ ను నిర్దోషిగా ప్రకటించింది. సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో కోర్టు ఈ కేసును కొట్టేసింది. 2006 సెప్టెంబర్ 9వ తేదీన వెంకట్ నివాసంలో ప్రశాంత్ రెడ్డి కాల్పుల్లో మరణించాడు. అప్పట్లో ఈ హత్య తీవ్ర సంచలనం కలిగించింది. కేశవరావు పిసిసి అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
తనకు న్యాయం జరిగిందని వెంకట్ కోర్టు తీర్పు అనంతరం అన్నాడు. తాను అమాయకుడినని ఆయన అన్నారు. తాను కేశవరావు కుమారుడిని కాబట్టే తనను ఈ కేసులో ఇరికించారని ఆయన ఆరోపించారు. పిస్టల్ మిస్ ఫైర్ అయి ప్రశాంత్ రెడ్డి గాయపడ్డాడని, గాయపడిన ప్రశాంత్ రెడ్డిని వెంకట్ ఆస్పత్రిలో చేర్పించాడని, చికిత్స పొందుతూ ప్రశాంత్ రెడ్డి మరణించాడని వెంకట్ తరఫు న్యాయవాది చెప్పారు. కోర్టు తీర్పు వెలువడే సమయంలో వెంకట్ కోర్టులో ఉన్నారు. ఆయన అనుచరులు కూడా పెద్ద యెత్తున కోర్టుకు వచ్చారు. ప్రశాంత్ రెడ్డి తరఫు బంధువులెవరూ కోర్టులో కనిపించలేదు.












Click it and Unblock the Notifications
