స్టాక్ మార్కెట్లు బంద్

ముంబయిలో తీవ్రవాదులు ఇంకా తమ మారణకాండను కొనసాగించే యత్నాలు చేస్తున్నారు. వీలైనంత ఎక్కువమందిని చంపటమే వారి లక్ష్యంగా కనిపిస్తోంది. తాజాగా గురువారం ఉదయం 9.30 ప్రాంతంలో నారిమన్ హౌస్ ప్రాంతంలో తీవ్రవాదులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఓ కుటుంబాన్ని నిర్భందించిన తీవ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ముంబయి పేలుళ్లలో తీవ్రవాదులు ప్రధాన లక్ష్యంగా చేసుకున్న తాజ్ హోటల్ వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ ప్రాంతాన్ని భద్రతాదళాలు పూర్తిగా తమ అదుపులోకి తీసుకున్నాయి. హోటల్‌లో ఇంకా కొందరు తీవ్రవాదులు విదేశీ బందీలు ఉన్నట్లు తెలియటంతో సైన్యం కాల్పులు జరుపుతోంది. తీవ్రవాదులు కూడా ఎదురుకాల్పులు జరుపుతున్నారు. ఉద్రిక్తత తీవ్రంగా ఉండటంతో తాజ్ హోటల్ ఉన్న కొలాబా ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు.












Click it and Unblock the Notifications
