మా వారిని వదిలేస్తేనే...: హెచ్చరిక
ముంబయి: ముజాహిదీన్లందరినీ వదిలేస్తేనే తమ వద్ద బందీలుగా ఉన్నవారిని విడిచిపెడతామని ఒబెరాయ్ హోటల్లోని ఉగ్రవాదులు హెచ్చరిస్తున్నారు. ఒబెరాయ్ హోటల్లోని ఒక ఉగ్రవాది న్యూస్ చానెల్ తో ఈ విషయం చెప్పాడు. తాము హోటల్లో ఏడుగురం ఉన్నట్లు అతను తెలిపాడు. భారత్ తన వద్ద ముజాహిదీన్లందరినీ వదిలేయాలని, అప్పుడే తమ వద్ద బందీలుగా ఉన్నవారిని సురక్షితంగా విడిచిపెడతామని తనను తాను షాహదుల్లాగా చెప్పుకుంటున్న ఉగ్రవాది చెప్పాడు.
ముజాహిదీన్లను వదిలేస్తే ముస్లింలు నివసిస్తున్న భారత్ ను ఇబ్బంది పెట్టబోమని అతను అన్నాడు. ఒబెరాయ్ హోటల్లో తాజాగా కాల్పులు ప్రారంభమయ్యాయి. ఉగ్రవాదుల చేతుల్లో కొంతమంది విదేశీయులు కూడా బందీలుగా ఉన్నట్లు సమాచారం. ఉగ్రవాదుల దాడుల్లో మరణించినవారిలో ఏడుగురు విదేశీయులు కూడా ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య 105 కు చేరుకుంది. తాజ్ హోటల్లోంచి పొగలు వస్తున్నాయి. ఆర్మీ కమెండోలు తాజ్, ఒబెరాయ్ హోటల్లోకి ప్రవేశిస్తున్నారు. ఒబెరాయ్ హోటల్లో దాదాపు 100 మంది చిక్కుకున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications
